ప్రయివేటు టీచర్‌కు పిటిఎల్‌యు ఆర్థిక సాయం

Apr 5,2024 23:14
ఇటీవల రోడ్డు ప్రమాదంలో

ప్రజాశక్తి – పిఠాపురం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయివేటు టీచర్‌ కె.కిరణ్‌కుమార్‌కి ప్రయివేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ ఆర్ధిక సాయాన్ని అందించింది. స్థానిక సూర్యరాయ డిగ్రీ కాలేజీలో పని చేస్తున్న కిరణ్‌కుమార్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మూడు నెలలపాటు బెడ్‌ రెస్ట్‌ అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రయివేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు ఆయనను పరామర్శిం చారు. రూ.40 వేల ఆర్థిక సాయాన్ని అందించడం తోపాటు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు టీచర్స్‌కు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కోసం ప్రతీఒక్కరికీ పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లించేలా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. తోటి ఉపాధ్యాయుడికి సాయం చేసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవ సలహాదారులు పి.కృష్ణారావు, రాష్ట్ర కోర్డినేటర్‌ పి.కిరణ్‌కుమార్‌రాజు, నాయకులు వై.వెంకటేశ్వర రావు, ఎం.శ్రీనుబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.

➡️