ఆటో డ్రైవర్‌ వైద్యానికి ‘చేయూత’ రూ.లక్ష సాయం

May 4,2024 22:59
ఆటో డ్రైవర్‌ వైద్యం కోంస చేయూత

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

ఆటో డ్రైవర్‌ వైద్యం కోంస చేయూత సంస్థ రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందించింది. వివరాల్లోకి వెళ్లితే.. కాకినాడ రూరల్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ శేషగిరి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శేషగిరికి మెదడులో మాస్టర్‌ గ్లాండ్‌ పక్కన కణితి ఏర్పడి చూపు మందగించింది. ఆ సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ డ్రైవర్‌కు ఉపాధ్యా యుడు, చేయూత సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ వినీల్‌ మాట సాయంగా చేయూత సంస్థ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో శేషగిర తన సమస్యలను చేయూత సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో చేయూత సంస్థ ప్రతినిధులు నిజనిర్ధారణ చేసుకుని సంస్థ సభ్యుల ద్వారా నిధుల సమీకరణ చేశారు. అతని వైద్యానికి అవసరమైన రూ.1 లక్షను ఆదిత్య విద్యా సంస్థల డిగ్రీ కళాశాల సెక్రటరీ, రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైస్‌ ఛైర్మెన్‌ డాక్టర్‌ నల్లమిల్లి సుగుణ చేతుల మీదుగా శనివారం అందించారు. చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్‌, అలీమ్‌ మాట్లాడుతూ తమ సంస్థ సభ్యులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు, యువత మానవత్వమే తమ సంస్థ ద్వారా సాయం అందించగల్గుతున్నామని తెలిపారు. ఎదుటి వారి కష్టానికి తోడుగా తమ కష్టార్జితాన్ని అందించినపుడే అభాగ్యులకు అండగా ఉండవచ్చునని అన్నారు. ఈ కార్య్రమంలో చేయూత ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణ మూర్తి, ఉపాధ్యక్షులు వల్లీ బాషా, చేయూత సభ్యులు శ్రీనివాస్‌ వినీల్‌, మాచారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, పవన్‌, మాధవ్‌ పాల్గొన్నారు.

➡️