శృంగార వల్లభ స్వామికి రూ.4.04 లక్షల ఆదాయం

May 18,2024 17:15
మండలంలోని తిరుపతి

ప్రజాశక్తి – పెద్దాపురం

మండలంలోని తిరుపతి గ్రామంలో ఉన్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం ఒకరోజు వివిధ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,95,300, అన్నదాన విరాళాల ద్వారా రూ. 94,492, కేశఖండన ద్వారా రూ.11,400, తులాభారం ద్వారా రూ.400, కానుకల ద్వారా రూ.3,000 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. యాత్రికులకు ఉదయం పులిహార ప్రసాదం, మధ్యాహ్నం మహా అన్నదానం, వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ చలివేంద్రం నిర్వహించామన్నారు. యాత్రికులకు ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, గ్రామస్తులు సేవలందించారు.

➡️