పారిశుధ్యం అద్వానం

Apr 16,2024 23:09
పట్టణ శివారులోని

ప్రజాశక్తి – పెద్దాపురం

పట్టణ శివారులోని తలుపులమ్మ కాలనీలో పారిశుధ్య నిర్వహణ పట్ల మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చెత్త పోగులు పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీరయ్యమ్మ పేట నుంచి తలుపులమ్మ కాలనీకి వెళ్లే రహదారిలో పరిస్థితి మరింత అద్వానంగా తయారయింది. ఈ రహదారిలో తలుపులమ్మ కాలనీ శివారు వీధిలో రోజుల తరబడి చెత్తను తొలగించేం దుకు సిబ్బంది రాకపోవడంతో చెత్త కుండీలు నిండిపోయి రహదారి నిండా చెత్త పోగులు పేరుకు పోతున్నాయి. ఈ చెత్త పోగుల్లో పం దులు, కుక్కలు గుంపులుగా చేరి చెత్త పోగు లను కెలకటంతో రహదారిలో వెళ్లేవారు దుర్వా సనతో అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భం గా కాలనీవాసులు మాట్లాడుతూ పది రోజులు గా తమ కాలనీలో చెత్త తొలగించేందుకు సిబ్బంది రావటం లేదన్నారు.పేద, అట్టడుగు వర్గాలు, చేతి వృత్తిదారులు అధికంగా నివసించే ఈ కాలనీలో పారిశుధ్య నిర్వహణపై అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసు లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి ఈ కాలనీని పరిశీలించి ఏ రోజు చెత్త ఆ రోజు తొలగించేవిధంగా చర్యలు తీసుకో వాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️