గాడిమొగ పంచాయితీ కార్మికులకు సంక్రాంతి కానుక

Jan 12,2024 14:27 #Kakinada
sankranti gift to workers

 

ప్రజాశక్తి-తాళ్లరేవు: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గాడిమొగ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి , కామాడి మాతరాజు, ఉపసర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్ పాలకవర్గ సభ్యులు నూతన దుస్తులు అందజేశారు. పంచాయతీలోని 48 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతలు అందించారు. సంక్రాంతి సందర్భంగా కార్మికులకు ప్రతి ఏటా సంక్రాంతి కానుకగా ఒకటి యూనిఫామ్, ఒకటి సివిల్ డ్రెస్ అందిస్తున్నట్లు సర్పంచ్ గోవ లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీ.జె.వి రమణ, ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కామాడి మాతరాజు, నల్లి బాలకృష్ణ, పలువురు వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️