ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం

Apr 23,2024 22:29
వివిధ ప్రాం తాల్లో విధులు

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

వివిధ ప్రాం తాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఎస్‌పి, 3వ బెటాలియన్‌ ఎఫ్‌ఎసి కమాండెంట్‌ ఎస్‌.సతీష్‌ కుమార్‌ సూచించారు. మంగళ వారం మెడికవర్‌ యూనిట్‌ హాస్పిటల్లో బాల ఇఎన్‌టి ఆధ్వర్యంలో 3వ బెటాలియన్‌ సిబ్బందికి మెడికల్‌ క్యాంపును నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేద న్నారు. అందుకోసమే ప్రతీ నెల సిబ్బందికి మెడికల్‌ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలందు కోవడం ద్వారా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మెడికల్‌ క్యాంపులను సిబ్బం దితోపాటు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కె. బాలకిరణ్‌, ఇఎన్‌టి డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ సునీల్‌, యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీదేవి, లేడీ మెడికల్‌ ఆఫీసర్‌, బెటాలి యన్‌ ఆఫీసర్స్‌ అడిషనల్‌ కమాండెంట్‌ ఇఎస్‌.సాయిప్రసాద్‌, అడిషనల్‌ ఎస్‌పి ఎల్‌.అర్జున్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు సత్య నారాయణ, మురళికుమార్‌, ఆర్‌ఐలు సురేష్‌బాబు, రవిశంకర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

➡️