ప్రేరణ ఉత్సవంలో కోనసీమ విద్యార్థులు

Apr 20,2024 22:30
స్థానిక నవోదయ విద్యాలయలో

ప్రజాశక్తి – పెద్దాపురం

స్థానిక నవోదయ విద్యాలయలో శనివారం జరి గిన ప్రేరణ ఉత్సవం పోటీల్లో కోనసీమ జిల్లా నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో కోన సీమ జిల్లా సమగ్ర శిక్ష అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీ సర్‌ పి.రాంబాబు పాల్గొని మాట్లాడారు. కోనసీమ జిల్లా నుంచి 200 మంది విద్యా ర్థులతోపాటు 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. నవోదయ విద్యా లయ ప్రిన్సిపల్‌ ఆర్‌.కమలం మాట్లాడుతూ ప్రేరణ ఉత్సవంలో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహిం చినట్లు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపల్‌ కె.రామకృ ష్ణయ్య మాట్లాడుతూ ఈ పోటీల్లో ఒక్కొక్క విభాగం నుంచి 15 మంది చొప్పున 30 మం దిని ఎంపిక చేసి వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ, క్విజ్‌ పోటీలు నిర్వహించి కేవలం ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారన్నారు. జిల్లాకు ఇద్దరు చొప్పున పది జిల్లాల నుంచి ఎంపికైన 20 మంది విద్యార్థులు, వారితోపాటు పదిమంది ఉపా ధ్యాయులు గుజరాత్‌లోని వాడ్‌ నగర్‌ గ్రామం లో’ వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి ఆఫీసర్‌, లెఫ్ట్‌నెంట్‌ సనపల సత్యనా రాయణ, ఉపాధ్యాయులు వి.జగన్మోహన రావు, గురుగుబెల్లి పాపారావు, సుధీర్‌ కుమార్‌, డి.చక్రవర్తి, వి.ప్రేమలత, ఎం.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

➡️