వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

May 3,2024 23:33
వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

ప్రజాశక్తి-పిఠాపురం సహదయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులను స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలోని చెలికాని భావనరావు సభా సదన్‌లో ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్‌ పి.ఎన్‌ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి క్షణం చాలా విలువైనదన్నారు. వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వధా చేసుకోవద్దని పాఠశాలలో కేవలం పాఠ్యాంశాలు మాత్రమే బోధిస్తారని, కానీ ఈ శిక్షణ తరగతుల్లో పాఠ్యాంశాలతో పాటు ప్రతి విద్యార్థినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమయ్యే వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, ఏకాగ్రత, సృజనాత్మక కళలు, దేశభక్తిని పెంపొందించుకోవడం మొదలగు అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ప్రతి విద్యార్థి ఈ శిక్షణ తరగతులకు హాజరై తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సంస్థ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ 24 ఏళ్లుగా నిరాటంకంగా ఈ వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. విద్యార్థులందరూ క్రమం తప్పక శిక్షణా తరగతులకు హాజరవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పోతుల శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.సతీష్‌, కోశాధికారి పి.పావని, సీనియర్‌ సభ్యులు కె.అప్పారావు, ఎన్‌.గంగబాబు, శ్రీకృష్ణదేవరాయలు, ప్రభు మాస్టారు, గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి కొండేపూడి శంకరరావు, భాష్యం పాఠశాల ప్రిన్సిపల్‌ పి.వేణు, టిఎన్‌.ప్రసాద్‌, రవీంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️