చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

May 5,2024 23:11
మండలంలోని వడ్లమూరు

ప్రజాశక్తి – పెద్దాపురం

మండలంలోని వడ్లమూరు గ్రామంలో టిడిపి పెద్దాపురం నియోజక వర్గ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచా రాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధించేం దుకు టిడిపికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రద్రేశ్‌గా మార్చేశారని అన్నారు. జగన్‌ పాలనతో 20 ఏళ్లు వెనక్కుపోయిన రాష్ట్రాన్ని కాపాడుకో వాలంటే చంద్రబాబు నాయుడు వంటి అనుభవశీల ముఖ్యమంత్రి కావటం ద్వారానే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ కార్య కమంలో బిజెపి నాయకులు విత్తనాల వెంకట రమణ, టిడిపి నాయకులు పాలచర్ల బుజ్జి, ప్రసాద్‌, బోస్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️