కార్మికోద్యమ నేత సత్యనారాయణకు ఘన నివాళి

May 22,2024 22:10
స్వాతంత్ర సమరయోధుడు,

ప్రజాశక్తి – కాకినాడ

స్వాతంత్ర సమరయోధుడు, కార్మి కోద్యమ నేత, ప్రజా ప్రతినిధి, రాష్ట్ర సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు పర్సా సత్యనారాయణకు సిఐటియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో పర్సా సత్యనారాయణ 9వ వర్థంతి కార్యక్రమం సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ అధ్యక్షతన జరిగింది. తొలుతగా ఆయన చిత్రపటానికి సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ బొగ్గుగని కార్మికుడిగా పనిచేస్తూ పర్సా సత్యనారాయణ కార్మికులపై సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా, ఆకలిలేని సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో సిఐటియు సంఘాన్ని స్థాపించి అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించా రన్నారు. మూడు దఫాలు ఎంఎల్‌ఎగా పని చేసినా అత్యంత సాధారణ జీవితం గడిపారని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఎందరో నూతన నాయకత్వాన్ని తయారుచేసి కార్మికో ద్యమానికి అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, రాణి, రాక్‌ సిరామిక్స్‌ కార్మికులు బి.చంద్రశేఖర్‌, టి.వరప్రసాద్‌, ఎస్‌. సతీష్‌ కుమార్‌, బి.రామకృష్ణ, ఎం.రామకృష్ణ, వి.సతీష్‌కుమార్‌, వివిఎస్‌. సుబ్బారావు, ఎస్‌.గంగాధర్‌, ఎఎస్‌ఆర్‌ సత్యనారాయణ, కె.శివన్నారాయణ, బి.ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

➡️