69వ ఉర్స్ ఉత్సవాలు

Feb 9,2024 13:13 #Kakinada
urs festival

మతాలకు అతీతంగా రానున్న ప్రజలు
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : ఈనెల 16వ తేదీ నుండి పొన్నాడలో ఉన్న బషీర్ బేబీ ఉర్స్ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ముస్లిం పెద్దలు శుక్రవారం తెలిపారు. హిందూ, ముస్లిం అని తేడా లేకుండా రాష్ట్రం నుండే కాకుండా, దేశవ్యాప్తంగా రానున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఆదివారం ఉత్సవాలు ముగుస్తాయని మూడు రోజులపాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 18వ తేదీన రాత్రి 10 గంటలకు రేడియో టీవీ సింగర్స్ చాంద్ అతీస్, షాదీగా సంజరిలతో ప్రోగ్రామ్స్ జరుగుతాయని తెలిపారు. ముస్లిం సోదరులు బషీర్ బేబీగా హిందువులు బంగారు పాపముగా పిలవబడే దర్గాకు వచ్చి వారి కోర్కెలు కోరుకుంటే తీరుతాయని ప్రగాఢ నమ్మకం ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, ఇలా దేశంలో ప్రధాన పట్టణాల నుండి విచ్చేసే భక్తులకు నివాసాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు.

➡️