నిర్భయంగా ఓటు వేయండి

Apr 21,2024 22:04
నిర్భయంగా బయటకు వచ్చి

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

నిర్భయంగా బయటకు వచ్చి మనం ఓటు వేసినప్పుడే మనం ఏదైనా సాధిం చగలమని ప్రముఖ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఐవి.రావు పిలుపు నిచ్చారు. ఆదివారం కాకినాడలో బ్రాహ్మణత్వం స్ధాపకులు రాయ వరపు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో చల్లా నిరంజన్‌ శ్రీనివాస్‌ అధ్య క్షతన విద్యుత్‌ నగర్‌ చల్లా వారి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బ్రాహ్మణ ఓటింగ్‌ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయని, అయితే మన మధ్య ఉన్న అవగాహన లోపం వల్ల అవి కొందరి స్వార్ధపరుల చేతుల్లో బంధీగా మారు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బ్రాహ్మణ సంఘాల ప్రాముఖ్యత అనవస రమని, ఎవరైతే తమ వృత్తిలో ఇతర బ్రాహ్మణులకు అండగా నిలుస్తారో అటువంటి వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా ప్రముఖ లాయర్‌ అయ్యగారి వెంకటేష్‌ మాట్లా డుతూ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులపై దా డులు జరిగినప్పుడు బ్రాహ్మణులకు అండ గా సంఘాలు స్పందిస్తే, దానికి అను గుణంగా రాజకీయ నాయకులు స్పంది స్తారని, అప్పుడే మనకు మరిం త అండ లభిస్తుందని అన్నా రు. ఈ సందర్భంగా ముంజు లూరి విశ్వేశ్వరరావు మాట్లా డుతూ సమాజ హితం కోరే బ్రాహ్మణులు మీద దాడులు చేయడం దుర్మార్గం అని, దాన్ని నివారించాలంటే మన మధ్య ఐక్యత ఎంతైనా అవసరమని పిలుపునిచ్చారు. చల్లా నిరంజ న్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ బ్రాహ్మణుడి వంటిపై చెయ్యి వేసినవాడిని అక్కడే అణగ తొక్కి నార తీయాలని తెలిపారు. రాయ వరపు ప్రభాకర్‌ మాట్లా డుతూ ఎటువంటి రాజకీయ ఎజెండా కన్న బ్రాహ్మణుల మధ్య ఐక్యత ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో జమలమడక రామశర్మ, పద్మనాభ స్వామి, ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ సిహెచ్‌వివి.రమణమూర్తి పాల్గొన్నారు.

➡️