అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం : నానాజీ

Jun 17,2024 22:45
కూటమి ప్రభుత్వం ఇచ్చిన

ప్రజాశక్తి – కరప

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఎంఎల్‌ఎ పంతం నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ గుడారిగుంటలోని ఆయన నివాసంలో రూరల్‌ నియోజకవర్గానికి చెందిన అంగన్‌వాడీలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌ వాడీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో అంగన్‌వాడీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొ న్నారని అన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో అంగన్‌వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని అన్నారు. ఎంఎల్‌ఎను కలిసిన వారిలో రూరల్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.వీరవేణి, వి.వీరమణి, పలు గ్రామాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️