అంజు ఆసుపత్రి సేవలు ప్రశంసనీయం

Mar 21,2024 22:48
అంజు ఆసుపత్రి సేవలు ప్రశంసనీయం

ప్రజాశక్తి -మామిడికుదురుఅంజు ఆసుపత్రిలో పేదలకు ఉచిత ఆపరేషన్‌ సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కొమ్ముల వెంకట సత్యనారాయణ స్వామి అన్నారు. అంజు ఇంటర్నేషనల్‌ ఐ కేర్‌ ఫౌండేషన్‌, కాకినాడ, విజన్‌ ఫర్‌ అల్‌ స్విట్జర్లాండ్‌ ఆధ్వర్యంలో మామిడికుదురులో అంజు కంటి ఆసుపత్రి ఆవరణలో గురువారం నిరుపేదలకు ఉచితంగా కంటి శుక్లం ఆపరేషన్స్‌ను తేజ ప్రారంభించారు. వృద్ధాప్యంలో వచ్చే లెన్స్‌ మార్పు వల్ల శుక్లాలు వస్తాయని తెలిపారు. విజన్‌ ఫర్‌ అల్‌ స్విట్జర్లాండ్‌ సహాయంతో అంజు ఐ కేర్‌ ఫౌండేషన్‌ వారు అంజు కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్‌ చేస్తామని తెలిపారు. డాక్టర్‌ ఆండ్రే మెరమండ్‌ మాట్లాడుతూ సంవత్సరానికి 1500 ఆపరేషన్ల విజన్‌ ఫర్‌ అల్‌ -స్విట్జర్లాండ్‌ తరపున ఉచితంగ చేస్తామని తెలిపారు. మోరి కూడా ఐకేర్‌ ఆసుపత్రి నిర్వహిస్తున్నామని చెప్పారు. వివరాల కోసం అంజు కంటి హాస్పిటల్‌- స్టేట్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా ఎదురుగ మామిడికుదురులో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్‌ తేజ, డాక్టర్‌ ఆండ్రే మెరమండ్‌, డాక్టర్‌ సత్యనారాయణ స్వామి, డాక్టర్‌ విజయ లక్ష్మి, డాక్టర్‌ లత, డాక్టర్‌ రూహి, మేనేజర్‌ స్వామి వందనం, భరత్‌, సూర్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️