అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Mar 9,2024 17:49

గడప..గడపకూ వైసిపి కార్యక్రమమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి శ్రీనివాస్‌ రాజు, ఎంపిపి అంబటి భవాని

ప్రజాశక్తి- రామచంద్రపురం

సిఎం జగన్‌ పాల నలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయనివైసిపి నియోజకవర్గ పరిశీలకులు చింతల పూడి శ్రీనివాస్‌రాజు అన్నారు. గడపగడపకూ వైసిపి కార్యక్ర మంలో శనివారం జగన్నాయకులుపాలెం, వేగాయమ్మ పేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. నియో జకవర్గంలోని ఓటర్లు అంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరిశీలించుకోవాలని మీకు మేలు చేసే ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి అంబటి భవాని పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న పథకాల కరపత్రాలను గ్రామస్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఎపి ఐడిసి డైరెక్టర్‌ వాసంశెట్టి శ్యామ్‌, గ్రామ సర్పంచ్‌ అనిశెట్టి రామకృష్ణ, ఎంపిటిసి సభ్యుడు బల్ల సుధాకర్‌, ఆదివారపుపేట సర్పంచ్‌ నక్కిన దొరబాబు, వేగయమ్మపేట సర్పంచ్‌ అంబటి తుకారాం తదితరులు పాల్గొన్నారు.

 

➡️