రామోజీ సంస్మరణ సభ

Jun 23,2024 22:28

మామిడికుదురు లో ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రామోజీ సంస్మరణ సభ

ప్రజాశక్తి-మామిడికుదురు

మామిడికుదురు ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఎస్‌టి కాలనీలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌టి కాలనీలో సుమారు 150 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు.ముందుగా మామిడికుదురు సర్పంచ్‌ గౌస్‌ మొహిద్దీన్‌, ఎంపిటిసి సభ్యులు నయినాల సీతామహాలక్ష్మి సత్యమూర్తి మాట్లాడుతూ రామోజీరావు సేవలు ఎనలేనివి అన్నారు. పలువురు మాట్లాడుతూ మీడియా రంగానికి ఆదర్శవంతంగా రామోజీరావు నిలిచారని అన్నారు. కార్యక్రమంలో స్థానికులు నయినాల సత్యమూర్తి,నయినాల కాశీ , మాజీ సర్పంచ్‌ కడలి రామకష్ణ, ప్రెస్‌ క్లబ్‌ అద్యక్షులు నయినాల సత్య దుర్గా ప్రసాద్‌, కోశాధికారి ఏడిద బాలకష్ణా రావు, జాయింట్‌ సెక్రటరీ గుబ్బల హరిబాబు, కడియం త్రినాథ స్వామి,ఏడిద వెంకటేశ్వర రావు,బోయి రాంబాబు,తోరం సత్యనారాయణ, ఏడిద లోకేష్‌, స్థానిక యువత బుంగా సుబ్బు, శెట్టిబత్తుల అజరు, గెడ్డం ఉదరు, భూపతి చందు, ముస్కూడి మురళీ, బద్దె దినేష్‌, యాన్నాబత్తుల నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️