ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి

Mar 11,2024 23:19
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి

ప్రజాశక్తి-అమలాపురంసుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించాలని తీర్పునిచ్చినా సమయం ఇవ్వాలని ఎస్‌బిఐ కోరడానికి నిరసనగా స్థానిక ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరావు మాట్లాడుతూ తక్షణం ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌బిఐ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్లను, భూర్జువా పార్టీలను కాపాడేందుకే ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లు వివరాలు ఇవ్వకుండా దాట వేస్తోందన్నారు. సుమారు దేశవ్యాప్తంగా కోట్ల మంది ఖాతాదారులను కలిగిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుందని ఐదు నిమిషాల వ్యవధిలో ఎన్నికల బాండ్లు వివరాలు చెప్పే టెక్నాలజీ ఎస్‌బిఐ దగ్గర ఉందని కార్పొరేట్‌ కంపెనీలను బడా బూర్జువా పార్టీలను కాపాడేందుకు ఎన్నికల బాండ్ల వివరాలను చెప్పేందుకు నిరాకరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల ముసుగులో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని, కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు ధారాధత్తం చేశారని చెప్పారు. ఈ ధర్నాలో జి.దుర్గాప్రసాద్‌, ఎం.బలరామ్‌, నాయకులు, విప్పర్తి మోహన్‌ రావు, భాస్కరరావు, వెంకటరమణ, సుధాకర్‌ పాల్గొన్నారు.

➡️