కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటకీ ప్రచారం

Mar 5,2024 17:41

సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

అమలాపురం మండలం ఎ.వేమవరంప్పాడులో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో మంగళవారం ఇంటింటికీ ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలం పార్టీ అధ్యక్షులు రాయుడు వెంకట రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డి సి సి అధ్యక్షులు కామన ప్రభాకర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఎవరికిచ్చినా వారి విజయానికి కృషి చేసి పార్టీ ని గెలిపించుకునేందుకు కార్యకర్తలు అందరు కలసి కష్టపడాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి మెంబర్‌ చీకట్ల అబ్బాయి, పీసీసీ ఉపాధ్యక్షులు కొత్తూరు శ్రీనివాస్‌, పిసిసి అధికార ప్రతినిధి గెడ్డం సురేష్‌ బాబు, పిసిసి జనరల్‌ సెక్రటరీలు మాచవరపు శివన్నారాయణ, అయితాబత్తుల సుభాషిని, అమలాపురం పట్టణ అధ్యక్షులు వంటెద్దు బాబి, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

➡️