అఖిల భారత 11వ చిత్రలేఖనం పోటీల్లో సెయింట్‌ జాన్స్‌ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణాజిల్లా) : అఖిల భారత 11వ చిత్రలేఖనం పోటీల్లో సెయింట్‌ జాన్స్‌ విద్యార్థులు బంగారు, రజత పతకాలు సాధించినట్లు గన్నవరం వి.యస్‌.సెయింట్‌ జాన్స్‌ మాధ్యమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ రెవ. బ్రదర్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సదర్భంగా ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ..డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్స్‌ అకాడమీ, కె.యల్‌ యూనివర్సిటీ విజయవాడ వారు సయుక్తంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో పాల్గొని పతకాలు సాధించారన్నారు. విద్యార్థులలోని సృజనకు పదును పెడితే ఏ రంగంలో నైనా నైపుణ్యాన్ని సాధించటం సులభ సాధ్యమన్నారు. అందుకే తమ విద్యా సంస్థల విద్యార్థులలోని ఆసక్తిని బాల్యంలోనే పసిగట్టి అయా రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అఖిల భారత 11వ చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు కె.హిమ సరయు , కె.రుద్రాన్సు, టి.షాలిని, కె.భవిత్‌, కె.శశాంక్‌, కె.వేద శ్రీ కావ్య, బి.సూరజ్‌ , డి.రఘు నందన్‌లు బంగారు పతకాలు, ఎ.శ్రీ కార్తిక, వి.జాహ్నవిలు రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు డి.శ్రీనివాసరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ రెవ. బ్రదర్‌ జిమ్మీకురియేకోస్‌, రెవ.బ్రదర్‌. భల్లాజోసఫ్‌ , రెవ. బ్రదర్‌. జయబాలన్‌ పాల్గొన్నారు.

➡️