క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహనా ర్యాలీలు

Mar 24,2024 17:09

మండపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ర్యాలీ

ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరిచుకుని జిల్లాలో ఆదివారం ప్రభుత్వాసుపత్రుల వైద్యసిబ్బంది అవగాహనా ర్యాలీలు నిర్వహించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

రామచంద్రపురం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని కుందూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. టిబి ని అరికట్టడం మన అందరి బాధ్యత అని ఆరోగ్య కేంద్రం వైద్యులు వైద్యులు డాక్టర్‌ నాయుడు తెలిపారు. రెండు వారాలకు మించిన జ్వరం, దగ్గు, కళ్ళు పడటం వంటివి టిబి వ్యాధికి ప్రథమ లక్షణాలని ఆయన వివరించారు. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా ఆరు నెలల మందులు వాడటం వల్ల దీనిని నివారించుకోవచ్చని మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరింత త్వరగా తగ్గుతుందన్నారు. దీనికి ప్రభుత్వం టిబి రోగికి రూ.3వేలు జమ చేస్తుందని వివరించారు. 2025 నాటికి పూర్తిగా టిబిని తరిమికొట్టాలని ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. మండపేట క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ సహకరించాలని స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకుమారి అన్నారు. ఆదివారం సిహెచ్‌సి వద్ద ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే చేపట్టాయన్నారు. ఇందులో భాగంగా క్షయ వ్యాధిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి రోగులు కోలుకునేంతవరకు వైద్య సేవలు అందిస్తారన్నారు. అంతేకాకుండా వ్యాధి లక్షణాలున్న వారి నమానాల సేకరించి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు గదిని పరిశీలించారు. అనంతరం ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహనలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్వైజర్‌ రమణ, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️