జగన్‌ పాలనలో విప్లవాత్మక మార్పులు : మంత్రి విశ్వరూప్‌

Jan 27,2024 23:10

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పినిపే విశ్వరూప్‌

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసి పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక మార్పులు సిఎం జగన్‌ తీసుకువచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. గొల్లవిల్లిలో శనివారం వైసిపి మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి అధ్యక్షతన మండల పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి విశ్వరూప్‌ పాల్గొని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న సిఎం జగన్‌ను తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, సర్పంచ్‌ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, ఎంపిటిసిల సమాఖ్య మండల అధ్యక్షుడు పెట్టా అప్పారావు, వైఎస్‌ ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ బోర్డు సభ్యులు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చీకట్ల కిషోర్‌, సర్పంచ్‌ లు పెయ్యల రాజ్‌ కుమార్‌, యర్రంశెట్టి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️