ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

Mar 14,2024 23:42

ట్రాఫిక్‌ లో ఇరుక్కుపోయిన 108 వాహనం

ప్రజాశక్తి-మండపేట

ఆపదలో ఆదుకునే సంజీవని 108 అంబులెన్స్‌ వాహనం గంటకు పైగా ఇరుక్కుపోయింది. మండలంలోని తాపేశ్వరం ద్వారపూడి రోడ్డు పనులు సంవత్సరాల తరబడి జరుగుతున్న నేపథ్యంలో తరచూ ట్రాఫిక్‌ కు అంతరాయం కలుగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం సాయంత్రం 108 అంబులెన్స్‌ వాహనం గంటకుపైగా ట్రాఫిక్‌ లో ఇరుక్కు పోయింది. దీంతో సంవత్సరాల తరబడి ఈ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయి తమ కష్టాలు ఎప్పుడు తొలగుతాయని వాహనదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.రోడ్డు పనులు పూర్తయ్యే వరకైనా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

 

➡️