ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

Feb 16,2024 17:18

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న నాగేశ్వరరావు

ప్రజాశక్తి-మండపేట

విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని మండపేట, రావులపాలెం మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు వై.నాగేశ్వరరావు, వి. శ్రీనివాసరావులు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిఎస్‌ స్కూల్లో రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు హెల్మెట్‌, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంతో జరిగే నష్టాలను వివరించారు. స్కూలు బస్సులు నడిపేవారు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై వక్తృత్వపోటీలు నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపిఎస్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ వల్లూరి చిన్నారావు, 200 విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️