తహశీల్దార్‌ ముక్తేశ్వర రావుకు ఘన సత్కారం

Feb 4,2024 18:11

ముక్తేశ్వరరావు దంతులను సన్మానిస్తున్న సిబ్బంది తదితరులు

ప్రజాశక్తి-రాజోలు

సాధారణ బదిలీల్లో భాగంగా రాజోలు తహశీల్దార్‌గా పనిచేసిన బి.ముక్తేశ్వరరావు తణుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం రాజోలు మండల విఆర్‌ఒల సంఘం ఆధ్వర్యంలో ముక్తేశ్వరరావు దంపతులను సత్కరించారు. విఆర్‌ఒల సంఘం నాయకులు మాట్లాడుతూ తహశీల్దార్‌ ముక్తేశ్వర రావు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసేవారన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ శివకోటి నుంచి మొగలికుదురు వరకు నేషనల్‌ హైవే పనులు వేగవంతంగా పూర్తి అయ్యాయంటే అది రాజోలు తహశీల్దార్‌ ముక్తేశ్వరరావు కృషి ఫలితమేనని అన్నారు. పలువురు మత్స్యకార సంఘం నాయకులు మాట్లాడుతూ ఫిషర్‌ మెన్‌ సొసైటీకి ఇసుక ర్యాంపు ఇప్పించి వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించారని అన్నారు. కార్యక్రమంలో డిటి శ్రీనివాస్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, విఆర్‌ఒల సంఘం అధ్యక్షుడు అన్నపూర్ణారావు, కెవివి.సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️