పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాలరాజు

Jan 24,2024 23:05

నియామక పత్రం అందుకుంటున్న సర్పంచ్‌ బాలరాజు

ప్రజాశక్తి-అంబాజీపేట

ఏపీ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పుల్లేటికుర్రు సర్పంచ్‌ జల్లి బాలరాజు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌ నుంచి బుధవారం నియామక పత్రం వచ్చిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతాకుమారి తెలిపారు. మంగళగిరిలో సర్పంచుల రాష్ట్రస్థాయి సమావేశం విజయవంతం చేసిన కృషి, ప్రజాసమస్యలపై సర్వసభ్య సమావేశాలోఅధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, గ్రామ సమస్యలపై దృష్టి సారించినందుకు ఈ పదవి వరించిందిని బాలరాజు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, కార్యదర్శి రంబాల రమేష్‌ తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్‌ ప్రజా ప్రతినిధులు వాణిగా ఉద్యమిం చేందుకు సర్పంచు లను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

 

➡️