పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్ష

Feb 25,2024 23:13
పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్ష

ప్రజాశక్తి-మండపేట, కాట్రేనికోన, రామచంద్రాపురంమండపేట పట్టణంలో ఆదిత్య, విజ్ఞాన్‌ కళాశాలతో పాటు స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్‌-2 పరీక్ష ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షకు 850 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 181 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 669 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఆదిత్య కాలేజీ వద్ద పట్టణ ఎస్‌ఐ హరికోటి శాస్త్రి తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. రామచంద్రపురం డిఎల్‌డిఒ శాంతి, తహశీల్దారు సురేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాము, ఎంపిడిఒ కె.శ్రీదేవి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా సాగింది. మొత్తం 500 మంది అభ్యర్థులకు గాను 469 మంది పరీక్షలు రాశారు. 31 మంది పరీక్షకు గైర్హాజరైనట్టు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రభాకర్‌ రావు తెలిపారు. విద్యార్థులకు తాగునీరు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాట్రేనికోన ఎస్‌ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం పట్టణంలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆర్‌డిఒ సుధాసాగర్‌ తెలిపారు. కిట్స్‌ కాలేజీలో 250 మంది అభ్యర్థులు పరీక్ష రాయవలసి ఉండగా 185 మంది హాజరయ్యారని, బిఎస్‌ఎన్‌ కాలేజీలో 750 మంది అభ్యర్థులకు 616 మంది హాజరయ్యారని, గరికపాటి రుద్రయ్య చౌదరి ఇంటర్‌ కాలేజీలో 400 మందికి 330 మంది పరీక్ష రాశారని, మోడరన్‌ డిగ్రీ కాలేజీలో 300 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 268 మంది హాజరైనట్లు ఆర్‌డిఒ వివరించారు.

➡️