పార్లమెంటుకి వన్ని తెచ్చిన మహా నాయకుడు బాలయోగి

Mar 3,2024 18:25

అంబాజీపేట లో బాలయోగి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు

ప్రజాశక్తి-అంబాజీపేట

పార్లమెంటు స్పీకర్‌ పదవికి వన్నెతెచ్చిన మహా నాయకుడు జిఎంసి.బాలయోగి అని టిడిపి అధికార ప్రతినిధి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండల పరిషత్‌ కార్యాలయం వద్ద బాలయోగి విగ్రహానికి మండల టిడిపి, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోనసీమకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత బాలయోగికే దక్కుతుందన్నారు. నేటి రాజకీయ నాయకులు బాలయోగిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుడాల ఫణి, శిరిగినీడి వెంకటేశ్వరరావు, జి.వి. రాఘవులు, అరిగెల బలరామమూర్తి, చిన్నం బాలవిజయరావు, పెదపూడి శ్రీనివాసరావు, యడ్లపల్లి తుక్కియ్య, రావణం రాము, ఎం.తాతాజీ,డిల్లీ, టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️