పోలియో రహిత సమాజం కోసం సహకరించాలి

Mar 3,2024 23:27

పుల్లేటికుర్రు పంచాయతీ వద్ద పోలియో చుక్కలు వేస్తున్న సర్పంచ్‌, వైద్యాధికారిణి ఇంద్రావతి

ప్రజాశక్తి – అంబాజీపేట

ప్రతి ఒక్కరూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించుకుని పోలియో రహిత సమాజం కోసం సహకరించాలని పిహెచ్‌ వైద్యాధికారులు వి.గౌతమి,కె.ఎన్‌.శ్రీనివాస్‌ లు కోరారు. అంబాజీపేట పిహెచ్‌సిల పరిధిలో 2,407 మంది పిల్లలకు గాను 99 శాతం మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. ఎవరూ పోలియో బారిన పడకుండా పూర్తిస్థాయిలో తగిన చర్యలు తీసుకుంటున్నామని ముక్కామల పిహెచ్‌సి వైద్యాధికారిణి ఎ. ఇంద్రావతి అన్నారు. 2,527 మంది గాను 97శాతంపూర్తి చేయడం జరిగింద న్నారు.పోలియో రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని ఆమె కోరారు. మిగిలిన వారికి సోమ, మంగళ వారాలు ఇంటింటికి వెళ్లి చుక్కలు పడని వారికి 100 శాతం పూర్తి చేయడం జరుగుతుందన్నారు.ఎ ంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి సభ్యురాలు బూడిద వరలక్ష్మి, సర్పంచ్‌ లు నాగాబత్తుల శాంతాకుమారి,జల్లి బాలరాజు,పేరాబత్తుల రామలింగరాజు, మద్దింశెట్టి దొరబాబు, బండారు వెంకటలక్ష్మి, కాండ్రేగుల శ్రీనివాసరావు, దొంగ నాగేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️