పోలియో రహిత సమాజమే లక్ష్యం

Mar 3,2024 18:26

మండపేట మండలం ఏడిదలో పోలియో చుక్కలు వేస్తున్న సర్పంచ్‌ ఆశీర్వాదం

జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమ ం ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా 0 నుంచి అయిదేళ్ల లోపు చిన్నారులకు ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పల్స్‌ పోలియో చుక్కులు వేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని చిన్నారుకు పోలియోచుక్కలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే లక్ష్యమని దీని కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.ప్రజాశక్తి-యంత్రాంగం

రామచంద్రపురం ఆదివారం ద్రాక్షారామ లో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని మండల పరిషత్‌ అధ్యక్షులు అంబటి భవాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రజలు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. కె.గంగవరం మండలంలో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కె.గంగవరం ఎంపిపి పంపన నాగమణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ సర్పంచ ్‌కొత్తపల్లి అరుణ ద్రాక్షారం ఆరోగ్య కేంద్ర వైద్యులు ప్రశాంతి పాల్గొన్నారు. రామచంద్రపురం, కె.గంగవనం మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పల్స్‌ పోలియో కార్యక్రమాలు జరిగాయి. వెంకటాయపాలెం గ్రామంలో సర్పంచ్‌ ఎల్లమెల్లి సతీష్‌ కుమారి, కూళ్ల గ్రామంలో సర్పంచ్‌ చిల్లీ నాగేశ్వరరావు, తామర పల్లెలో సర్పంచ్‌ తోకల మంగ శ్రీనివాస్‌, ఎర్ర పోతవరంలో పిల్లి రాంబాబు, కె.గంగవరంలో కోటి వెంకట్రావు పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు , ఆసుపత్రి స్టాఫ్‌ పాల్గొన్నారు. మండపేట ఏడిద గ్రామంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్నిగ్రామ సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటి. ఇది వస్తే, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, కాళ్లు, చేతులూ వంకర అవుతాయి. ఇది అంటువ్యాధి కాదన్నారు. దీన్ని రాకుండా చెయ్యడానిక పల్స్‌ పోలియో చుక్కలను 0 నుంచి 5 ఏళ్ల వయసు లోపు పిల్లలకు ఏటా ఒక రోజు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు.

 

➡️