పోలీసులకు యోగాపై అవగాహనా సదస్సు

Mar 22,2024 16:18

యోగాసనాలు వేస్తున్న పోలీస్‌ సిబ్బంది

ప్రజాశక్తి-అమలాపురం స్వామి వివేకానంద యోగా ఆశ్రమం గురువు డాక్టర్‌ జిమ్‌ యోగా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నందు అడిషనల్‌ ఎస్‌పి ఖాదర్‌ బాషా, ఎఆర్‌డి ఎస్‌పి విజయ సారధిల నేతత్వంలో శుక్రవారం పోలీసు సిబ్బందికి యోగా అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఖాదర్‌ బాషా మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వల్ల మన ఒంట్లో ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. గ్యాస్టిక,్‌ గుండెకి సంబంధించిన వ్యాధులు, బిపి, షుగర్‌ కీళ్లనొప్పులు వంటవిి వ్యాధులు రానివ్వకుండా నేటి యువత యోగాతో పాటు ఆహార నియమాలు పాటించాలన్నారు. సదస్సులో పోలీస్‌ సిబ్బంది, యోగా విద్యార్థులు పాల్గొన్నారని యోగా గురువు ఆయుర్వేదం ఫిజియోథెరపీ వైద్యుడు యోగా శ్రీనివాస్‌ అన్నారు.

 

➡️