ప్రాథమిక విద్యపై కళాజాతా

Feb 7,2024 22:46
ప్రాథమిక విద్యపై కళాజాతా

ప్రజాశక్తి-కపిలేశ్వరపురంమండలంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో బుధవారం ఆలమూరు శ్రమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక విద్యపై కళాజాతా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేదార్లంక, అద్దంకివారిలంక గ్రామాల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు అందించే సేవలు, అనుబంధ పోషణ, పూర్వ ప్రాథమిక విద్య, తదితర అంశాల పై అవగాహన కల్పించారు. గర్భిణిగా నమోదు చేసినప్పటి నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పూర్వ ప్రాథమిక విద్యను కళాజాతా ద్వారా అవగాహన చేశారు. అనంతరం శ్రమ కో ఆర్డినేటర్‌ ఈశ్వరి మాట్లాడుతూ సన్‌ గ్రూప్‌ క్రైమ్‌ సిటీ బెంగుళూరు సౌజన్యంతో మండలంలో 12 అంగన్వాడీ సెంటర్లకు చిన్నారులకు సంబంధించి పరికరాలు అందించి కళాజాతాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వీధి వెంకటరెడ్డి, నాతి గవరయ్య, ఎంపిటిసి సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు, సాకా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️