ప్రారంభమైన వెంకన్న బ్రహ్మోత్సవాలు

Feb 29,2024 16:23

చింతలూరులో అన్న సమారాధన

ప్రజాశక్తి -ఆలమూరు

చింతలూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అయిదురోజులపాటు నిర్వహించారు. పవిత్రోత్సవంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. పులిహారతో స్వామి రూపాన్ని ఏర్పరిచి అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన అన్న సమారాధనలో అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.

 

➡️