మండపేట మున్సిపల్‌ కమిషనర్‌గా రాము

Feb 3,2024 18:03

కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రాము

ప్రజాశక్తి-మండపేట

మండపేట మున్సిపల్‌ కమిషన ర్‌గా బొడ్డేపల్లి రాము శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా విశాఖపట్నం జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మండపేటకు వచ్చారు. మున్సిపల్‌ మేనేజర్‌ తాతపూడి కనకరాజు, ఆర్‌ఒ శర్మ, ఆర్‌ఐ వంక ప్రభాకర్‌ చౌదరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లావణ్య తదితరులు ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలి పారు. రాము గతంలో పలాస, రాజాం, పిఠాపురం, పాలకొండ, ఆముదాల వలసలో కమిషనర్‌గా, అనకాపల్లి, విశాఖ జిఎంహెచ్‌సి జోనల్‌ కమిషనర్‌గా పనిచేశా రు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన కమిషనర్‌ టి.రామకుమార్‌ ధర్మవరం బదిలీఅయ్యారు.

 

➡️