మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

Jan 24,2024 23:00

మహిళలకు చెక్కు అందజేస్తున్న మంత్రి విశ్వరూప్‌

ప్రజాశక్తి-అమలాపురం మహిళా సాధికారతే వైసిపి ప్రభుత్వం లక్ష్యమనిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ వెల్లడించారు. మంగళవారం జిఎంసి బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ ఆసరా పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్లకు బాసట కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెప్మా ఏర్పాటు చేసిన అర్బన్‌ మార్కెట్‌ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా ఆహా క్యాంటీన్‌ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగో విడత కింద లబ్ధిదారులకు 6343 మందికి రూ.5 కోట్ల 20 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి కూడుపూడి సూర్యనారాయణ రావు, అమలాపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, మున్సిపల్‌ కమిషనర్‌ విఐపి నాయుడు, మెక్మా పీడీ ప్రియంవద తో పాటు అమలాపురం పట్టణంలోని మహిళా పొదుపు సంఘాల సభ్యురాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.ఆసరా చెక్కుల పంపిణీ కాట్రేనికోన : ముమ్మిడివరం నియోజకవర్గం లో ఇప్పటి వరకు వివిధ పథకాలు ద్వారా సుమారు రూ. రెండు వేల కోట్లు వైసిపి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందని ఎంఎల్‌శ్రీ పొన్నాడ సతీష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం మండలం ఎంపిడిఒ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాట్రేనికోన మండలంలో 1347 స్వయం సహాయక సంఘాలలోని 13,477 మంది సభ్యులు కు రూ.8 కోట్ల 99 లక్షల 40 వేల 82 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టిటిడి ధర్మకర్త యానాదయ్య, కాశి బాల మునికుమారి, ఏడిద చక్రం, జెడ్‌పిటిసి సభ్యుడు నేల కిషోర్‌, ఎంపిపి పాలపు లక్ష్మి ధర్మారావు తదితరులు పాల్నొన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలురావులపాలెం రాష్ట్రాభివృద్ధిని, సిఎం జగన్‌ పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బుధవారం రావులపాలెంలో జరిగిన సభలో వైఎస్‌ఆర్‌ ఆసరా నాల్గో విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రావులపాలెం జెడ్‌పిటిసి సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్‌, ఎంపిపి కర్రి లక్ష్మీ నాగదేవి, వీర్రెడ్డి, రావులపాలెం సర్పంచ్‌ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్‌ గొలుగూరి మునిరెడ్డి, సాకా ప్రసన్నకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

 

➡️