ముగిసిన పౌష్టికార పక్షోత్సవాలు

Mar 23,2024 16:01

పౌష్టికార పక్షోత్సవం ముగింపు కార్యక్రమంలో సిడిపిఓ తదితరులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక ప్రకాశం మున్సిపల్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికార పక్షోత్సవాలు  శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ కపిలేశ్వరపురం ప్రాజెక్ట్‌ సిడిపిఒ గజలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యవంతులుగా జీవించాలని అన్నారు. మంచి ఆరోగ్యం పోషకాహారంలోనే ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకపోషక విలువలున్న పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు వి.సింహాచలం, సునీత, శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు దేవకీదేవి, సత్యకుమారి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

 

➡️