సంస్థాగత మార్పులకు వారధులు వాలంటీర్లు

Feb 17,2024 22:21

వాలంటీర్లను సత్కరిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

క్షేత్రస్థాయి పరిపాలన వ్యవస్థలో సంస్థాగత మార్పులకు వారధులుగా వాలంటీర్లు నిలిచారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ కొనియాడారు. గొల్లవిల్లిలో శనివారం వైసిపి మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి అధ్యక్షతన నిర్వహించిన వాలంటీర్ల అభినందన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ పాల్గొన్నారు. మండలంలో విశేష ప్రతిభ కనబరిచిన ఒకరికి సేవా వజ్ర రూ.45 వేలు, ఐదుగురికి సేవా రత్న ఒక్కొక్కరికీ రూ.30 వేలు, మిగిలిన 324 మంది వాలంటీర్లకు రూ.15 వేల చొప్పున బహుకరించి వారిని దుశ్శాలు వాలు కప్పి ప్రశంసా పత్రాలు మెడల్స్‌ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లకు మూడేళ్లుగా ఇస్తున్న ప్రోత్సాహకాలను ప్రస్తుత నాలుగో విడతలో 30 శాతం పెంచి ఇస్తున్నామన్నారు.సంక్షేమ పథకాల అమల్లో లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించిన వారిని ఎంపిక చేసి ప్రత్యేక నగదు బహుమతులను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ జొన్నాడ శ్రీదుర్గ, జెడ్‌పిటిసి సభ్యుడు సభ్యుడు గెడ్డం సంపదరావు, సర్పంచ్‌ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, మునిపల్లి సర్పంచ్‌ యర్రంశెట్టి రామచంద్రరావు, ఎంపిటిసిల సమాఖ్య మండల అధ్యక్షుడు పెట్టా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️