సమస్యల పరిష్కారానికి కృషి

Mar 6,2024 16:37

భీమ క్రోసు పాలెం లో పర్యటించిన ఎంపీ బోస్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

భీమక్రోసుపాలెం గ్రామంలో ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం తో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హామీ ఇచ్చారు. భీమక్రొసుపాలెం గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రముఖులను కలుసుకొని వచ్చే ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని తన కుమారుడు సూర్యప్రకాష్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అందరి మద్దతు పార్టీకి ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యునితో కలిసి ఆయన గ్రామంలోని ఇంటింటికీ పర్యటించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ప్రకాశ్‌ రెడ్డి, సర్పంచ్‌ లావరాజు, ఎంపిటిసి సభ్యుడు యన్నం దేవి, పలువురు వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

➡️