సిఎస్‌ఆర్‌ నిధులతో విద్యార్థులకు కనీస వసతులు

Feb 21,2024 17:31

హాస్టల్‌ విద్యార్థులకు పరుపులు అందజేస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి -అమలాపురం

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని ఎస్‌సి, బిసి సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ విద్యను అభ్యసించుచున్న 7,000 మంది విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ హి మాన్షు శుక్లా తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హల్లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ వారు సిఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద సమకూర్చిన రూ.10 లక్షలు అంచనా వ్యయంతో విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం సమకూర్చిన 1,020 పరుపులను జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ కంపెనీలు వారి అవసరాలు పనులు నిమిత్తం జిల్లా కలెక్టర్‌ వారి కలిసిన సందర్భంలో సిఎస్‌ఆర్‌ నిధుల కింద కోనసీమ జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని సూచించడం జరిగిందన్నారు. ఆ మేరకు కంపెనీలు సిఎస్‌ఆర్‌ కింద సంక్షేమ వసతి గృహాలకు వసతులు కల్పించడం జరుగుతోందన్నారు. రిలయన్స్‌ కంపెనీ వారు ఇంకా 6000 మందికి పరుపులు సమకూర్చాల్సిందిగా సిఎస్‌ఆర్‌ ప్రతినిధి పి.సుబ్రహ్మణ్యం వారికి సూచించారు. ఇప్పటికే రిలయన్స్‌ సంస్థ 55 సంక్షేమ వసతి గృహాలకు సిఎస్‌ఆర్‌ కింద ఇన్వర్టర్లను అందించిందన్నారు. మరో నాలుగు నెలల కాలంలో గెయిల్‌ సహకారంతో సురక్షిత త్రాగునీటి కోసం ఆరో ప్లాంట్లు సిఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద రానున్నాయని వీటికి వాటర్‌ కూలర్లు కూడా అమర్చడం జరుగుతుందన్నారు. టీవీలు కొన్ని సంక్షేమ వసతి గహాలకు సమకూర్చడం జరిగిందని, మిగిలిన వాటిని సిఎస్‌ఆర్‌ కింద ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్‌ బిల్లులు బెడదను తొలగించే దిశగా సంక్షేమ వసతి గృహాల పై భాగంలో సౌర విద్యుత్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో మీ యొక్క కనీస అవసరాలు తెలపాలని కోరగా నోట్‌ బుక్స్‌ ఏర్పాటు చేయాలని స్థానిక మండల పరిధిలోని వడ్డిగూడెం సంక్షేమ వసతి గృహానికి విద్యార్థిని, విద్యా ర్థుల రాకపోకల నిమిత్తం మరొక బస్సును కేటాయిం చాలని, వాషింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సి ఎస్‌ ఆర్‌ కింద కుక్కర్లు, గ్రైండర్లు, మిక్సీలు సంక్షేమ వసతి గృహాలకు అందించాలన్నారు దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఒఎన్‌జిసి వారి సహకారంతో మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు సరఫరా చేస్తామని నోట్‌ బుక్స్‌ ప్రింటర్స్‌ సౌజన్యంతో అందిస్తామన్నారు ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు కొరకు ప్రభుత్వ పరంగా నిధులు వెచ్చిస్తామని వడ్డి గూడెం సంక్షేమ వసతి గృహానికి మరొక ఆర్‌టిసి బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. సిఎస్‌ఆర్‌ కింద వాషింగ్‌ మిషన్‌లను, వాటర్‌ కూలర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రీడింగ్‌ ప్యాడ్లు ఏర్పాటుకు భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పంపిణీ చేసిన పరుపులలో 514 పరుపులను సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు, 506 పరుపులను వెనుకబడిన తరగతుల వసతి గృహాలకు అందించామన్నారు. రిలయన్స్‌ రిలయన్స్‌ సిఎస్‌ఆర్‌ హెడ్‌ పి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల విద్యార్థుల శ్రేయస్సు పైనే ఉంటుందని, ఆ దిశగా పలు కనీస వసతుల కల్పనకు ఎంతగానో పాటుపడుతు న్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఒ వెంకటేశ్వర్లు బిసి వెల్ఫేర్‌ అధికారి వై.సాంబమూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️