పోరాటాలతోనే హక్కుల సాధన

Jun 17,2024 23:11
పోరాటాలతోనే హక్కుల సాధన

ప్రజాశక్తి-అమలాపురం పోరాటాల ద్వారానే కార్మికులు హక్కులు సాధించుకోగలరని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎవి.నాగేశ్వరరావు, కె.సుబ్బారావమ్మ పిలుపు ఇచ్చారు. సిఐటియు జిల్లా ప్రథమ మహాసభ అమలాపురం యుటిఎఫ్‌ ఎంప్లాయీస్‌ హోమ్‌లో గుదే దుర్గాప్రసాద్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, సుబ్బరావమ్మ మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్న ప్పటికీ కార్పొరేట్లకు వరాలు, పేదలకు భారాలు తప్పడం లేదన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు పోరాటం ద్వారానే హక్కులు సాధించుకో గలమన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. లేకుంటే పోరాటాలే తప్పవని హెచ్చరించారు. అనంతరం గత రెండు సంవత్సరాల కార్యకలాపాలపై కె.కృష్ణవేణి ప్రవేశపెట్టారు.సిఐటియు జిల్లా కార్యవర్గం ఎన్నికమహాసభలో సిఐటియు జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా గుదే దుర్గాప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా నూకల బలరామ్‌, కోశాధికారిగా కె.కృష్ణవేణి, ఉపాధ్యక్షునిగా ఎం.భాస్కరరావు, బండి లక్ష్మి, కార్యదర్శిగా సత్యనారాయణ, మలకా సుభాషిణి 42 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, సిఐటియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు సుందరబాబు, కాకినాడ జిల్లా కోశాధికారి మలకా రమణ, జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవివి.సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన, భవన నిర్మాణ కార్మికులు, స్కూల్‌ కంటింజెంట్‌ వర్కర్లు, విఒఎలు, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మున్సిపల్‌ కార్యాలయం వెనక ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయ భవనాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరావు ప్రారంభించారు తొలుత సిఐటియు కార్యాలయం నుంచి యుటిఎఫ్‌ ఎంప్లాయీస్‌ హోమ్‌ వరకూ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో విత్తనాల రాంబాబు, విప్పర్తి మోహన్‌ రావు, పోలమూరు శ్రీనివాసరావు, నరేంద్ర, నేదునూరి లవరాజు, పరంధామయ్య, కుసుమ ఆదిలక్ష్మి, అమూల్య పాల్గొన్నారు.

➡️