అంబేద్కర్‌ కలలను సాకారం చేయాలి

Apr 15,2024 22:17
అంబేద్కర్‌ కలలను సాకారం చేయాలి

ప్రజాశక్తి-ముమ్మిడివరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఅర్‌ అంబేడ్కర్‌ కలలు గన్న ప్రబుద్ధ భారత్‌ను సాకారం చేయడంలో నిబద్ధత కలిగిన బౌద్ధ ఉపాసకులు సమిష్టిగా కృషి చేయాలని బుద్ధిస్టు సొసైటీ ఆఫ్‌ ఇండియా జాతీయ నాయకులు ఎస్‌ఎస్‌ఆర్‌.భూపతి అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్లో బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జిల్లా సర్వ సభ్య సమావేశం బిఎస్‌ఐ రాష్ట్ర నాయకులు మట్టా వెంకట్రావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. జరిగినది. తొలుత గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పుష్పాలు అర్పించి, పంచశీల పఠించారు. అనంతరం భూపతి మాట్లాడుతూ భారత్‌లో పుట్టి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం పొందిన ప్రభుద్ద భారత్‌ సాకారం చేయడంలో బౌద్ధ ఉపాసకులు, అనుయాయులు, అంబేడ్కరీయులు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. బిఎస్‌ఐ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా పెనుమాల సుధీర్‌, ఉపాధ్యక్షునిగా మట్టా వెంకట రమణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా యలమంచిలి సురేష్‌ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాసకులు చికురుమిల్లి చిరంజీవి, బిఎస్‌ఐ జిల్లా జనరల్‌ సెక్రెటరీ కాశి వెంకట రమణ, ఉపాధ్యక్షుడు జెవివి సత్యనారాయణ, ఉపాసిక పెనుమాల చిట్టిబాబు, దడాల రామకృష్ణ, కెవివి సత్యనారాయణ, బుడితి రాజేంద్ర ప్రసాద్‌, పులపకూర గాంగేయుడు, మాగాపు ఈశ్వరరావు, గిడ్ల రమేష్‌, కొమ్మాబత్తుల రఘు, నందిక ధనరాజు, కలకత్తా రమణ పాల్గొన్నారు.

➡️