వైసిపి శ్రేణులతో ఆత్మీయ సమావేశం

May 2,2024 23:15

సమావేశంలో మాట్లాడుతున్న విశ్వరూప్‌

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

చల్లపల్లి పంచాయతీ జగ్గరాజు పేటలో అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్‌ నాయకుడు, గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ కుంచే రమణారావు ఆధ్వర్యంలో గురువారం రమణారావు ఇంటి వద్ద నియోజకవర్గ స్థాయి క్రైస్తవ సంఘాలు, వైసిపి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వైసిపి అభ్యర్థులు విశ్వరూప్‌, రాపాక వరప్రసాద్‌లు హాజరయ్యారు. రమణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థులు విశ్వరూప్‌, రాపాకలు ప్రసంగిం చారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమికి బుద్ధి చెప్పాల ని కోరారు. అనంతరం రమణారావు చేస్తున్న సేవలు ప్రశం సనీయమన్నారు. విశ్వరూప్‌, రాపాక, ఎంఎల్‌సిలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌లను రమణారావు, సునీత దంపతులు సత్కరించారు. సమా వేశంలో ఎంపిపిలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషారావు, సర్పంచ్‌ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నంరాజు, ఎంపిటిసిల సమాఖ్య మండల అధ్యక్షుడు పెట్టా అప్పారావు, సర్పంచ్‌ యర్రంశెట్టి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️