మండపేటలో 2వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 13,2023 12:22 #Konaseema
anganwadi protest 2nd day konaseema mandapeta

ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో అమలు చేయకపోవడం దౌర్భాగ్యం అన్నారు. అంగన్వాడీలకు పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, పనిభారం తగ్గించాలని, ఆయాలకు ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని తదితర అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రముఖ హోమియో వైద్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్, యు టి ఎఫ్, సి ఐ టి యు నాయకులు సురేంద్ర కుమార్, బలరాం తదితరులు, బుధవారం జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ బేబీ, ఆదిలక్ష్మి, సిహెచ్ రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల, సత్యవేణి, పద్మ, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️