హౌసింగ్‌ గోదాముల్లో వార్షిక తనిఖీలు

Apr 6,2024 21:40

స్టాక్‌ పరిశీలిస్తున్న హౌసింగ్‌ డిఇ మల్లికార్జునరావు

ప్రజాశక్తి-ఆలమూరు

మండల పరిధి హౌసింగ్‌ శాఖ గోదాముల్లో రామచంద్రపురం హౌసింగ్‌ డిఇ కె.మల్లికార్జునరావు శనివారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మాణానికి సంబంధించిన వివిధ సరుకుల నిల్వలు, సంబంధిత రికార్డులను ఆయన పరిశీలించి, నిల్వలు సరిపోవడంతో సంతప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్‌ నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే సంబంధిత రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ అప్డేట్‌గా ఉండాలన్నారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎటువంటి అవకతవకలకు పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు. అలాగే స్థానిక అధికారులు అడిగిన పలు అనుమానాలను నివత్తి చేసి, సలహాలు సూచనలు అందజేశారు. కార్య క్రమంలో స్థానిక హౌసింగ్‌ ఎఇ డి.శ్రీనివాస్‌, రామచంద్రపురం హౌసింగ్‌ ఎఇ సత్యనారాయణ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, ప్రసాద్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దురా ్గప్రసాద్‌, రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️