సిమెంట్‌ రోడ్డు వేసేదెన్నడు..?

ప్రజాశక్తి-పుల్లలచెరువు : మండల పరిధిలోని కవలకుంట్ల గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. నాయుడుపాలెం నుంచి పుల్లలచెరువు వెళ్లే మధ్యలో ఉన్న ఈ రోడ్డును గ్రామ పరిసరాల వరకూ సిమెంట్‌ రోడ్డు వేస్తామని చెప్పారు. అందుకోసం గ్రామం మధ్యలో రోడ్డుకు తారు వేయకుండా వదిలేశారు. ఆ రోడ్డుపై గుంతలు పడినప్పుడు మాత్రం గ్రావెల్‌ తోలి సరి పెడుతున్నారు. సిమెంట్‌ రోడ్డు వేసేందుకు కేటాయించిన నిధులను కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కాజేశారని విమ ర్శలు వినిపిస్తున్నాయి. ఆ రోడ్డులో గుంతలు పడిన కారణంగా వర్షా కాలంలో నీరు నిలిచి వాహన దారులు గుంతలు ఉన్నవి తెలియక ప్రమా దాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిమెంట్‌ రోడ్డును వేసి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

➡️