మండపేట ఎమ్మార్వో ఆఫీసు వద్ద ఆశాల ధర్నా

Feb 9,2024 12:53 #Konaseema
asha workers protest in mandapeta

ప్రజాశక్తి మండపేట : ఆశా కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేసిన పోలీసులు తమ నాయకులను ఎక్కడ దాచారో తెలపాలంటూ మండపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
విధి నిర్వహణలో ఉన్న ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల ఆరో  తారీకు నుండి ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారన్నారు. అనారోగ్యంగా ఉన్న కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చోబెట్టడం వాళ్ళు రాకపోతే కుటుంబ సభ్యులు తీసుకెళ్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధానంలో వ్యవహరిస్తుండడం పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఆపేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.

➡️