కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలి

May 25,2024 22:17

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

సాధారణ ఎన్నికలు -2024 సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియను అవగాహనతో పారద ర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఓట్ల లెక్కింపు సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక ఎస్‌కెబిఆర్‌ కళాశాల నందు నమూనా ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంపూర్ణమైన అవగాహనను కౌంటింగ్‌ సిబ్బందికి కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్‌ ప్రక్రియలో భారత్‌ ఎన్నికల సంఘం పలు సంస్కరణలను తీసు కుని వచ్చిందని సాంప్రదాయ బ్యాలెట్‌ పేపర్‌ మాదిరిగా కాకుండా ఓట్ల లెక్కింపులో సమయాన్ని ఆదా చేయడానికి, ఎంతో క్లిష్టంగా ఉండే మాన్యువల్‌ లెక్కింపును తొలగించి ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను అందుబాటులోనికి తెచ్చిందన్నారు. ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధిగాంచిన మన దేశం లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఖచ్చిత త్వాన్ని నిర్ధారించడానికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ఎంతో ప్రాముఖ్య తను కలిగి ఉన్నాయన్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో కౌంటింగ్‌ అత్యంత పారదర్శకంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుగుణంగా స్పష్టతతో నిర్వహిం చాలన్నారు. ఈ నమూనా ఓట్ల లెక్కింపు కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఈవీఎంలో ఓట్ల లెక్కింపు కొరకు ఏర్పాటు చేసిన టేబుళ్ళు సిట్టింగ్‌ ఏర్పాట్లు ద్వారా కౌంటింగ్‌ ప్రక్రియను విశదీకరించారు.. డిఆర్‌డిఎ పీడీ జిల్లా శిక్షణల నోడల్‌ అధికారి వి. శివశం కర్‌ ప్రసాద్‌, రామచంద్రపురం ఆర్‌డిఒ ఎస్‌.సుధా సాగర్‌ లు కౌంటింగ్‌ సిబ్బందికి 40 మంది చొప్ప్పున రెండు బ్యాచ్లలో 80 మందికి కౌంటింగ్‌ పై ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారన్నారు. కంట్రోల్‌ యూనిట్లు ఓపెన్‌ చేయడం సీళ్ళు పరిశీలించి రిజల్ట్‌ నొక్కడం ద్వారా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చింది పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించే ప్రక్రియ తీరును వారు ప్రత్యక్షంగా సిబ్బందికి విశదీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి కౌంటింగ్‌ శిక్షణలో ఉన్న సిబ్బంది కౌంటింగ్‌ లో ఏ మేరకు అవగాహన కలిగి ఉన్నది ప్రశ్నించి అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియలో శిక్షణలో ఉన్నవారి సందేహాలను ఆయన అడిగి తెలుసుకుని అక్కడికక్కడే నివత్తి చేశారు. ప్రతి అంశాన్ని సిబ్బంది పూర్తిగా ఆకలింపు చేసుకుని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత స్పష్టతతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, రిటర్నింగ్‌ అధికారులు ఎ.శ్రీరామ చంద్రమూర్తి, డివి ఎస్‌.ఎల్లారావు, వి.మదన్‌ మోహన్‌రావు, జి.కేశ వర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

➡️