దారి మళ్లించిన నిధులు జమ చేయాలి

Jan 13,2024 12:11 #Konaseema
demand for pending funds release

పంచాయతీ కార్యాలయం ముట్టడిస్తాం

ప్రజాశక్తి – అంబాజీపేట : గ్రామాల అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన 988 కోట్లు నిధులలో ప్రభుత్వం దారి మళ్లించిన 600 కోట్లు నాలుగు రోజులలో పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ అలా ఖాతాలలో జమ చేయాలని లేని పక్షంలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు శనివారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంబాజీపేటలో పత్రికా ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులు దారి మళ్ళిస్తున్న సంఘటన ను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకించారు. గతంలో ఇదే విధంగా 8629 కోట్లు దారి మళ్ళించిన నిధులు తిరిగి పంచాయతీలకు జమ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. నిధులు జమ చేసేంతవరకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటంకు సమాయత్తం మవుచున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

➡️