నిత్యాన్నదానానికి రూ.10వేల విరాళం

May 18,2024 19:58

దాతకు చిత్రపటం అందిసున్న ఆలయ సహాయ కమిషనర్‌ మాధవి

ప్రజాశక్తి -మామిడికుదురు

అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌ కు దాత విరాళం అందజేశారు. కాకినాడకు చెందిన దూనబోయిన మంగాయమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగ మల్లేశ్వరరావు (కోనసీమ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ, సహాయ కమిషనర్‌ ) కోమల దంపతులు ప్రతి సంవత్సరం కార్తీక మాసం బహుళ త్రయోదశి రోజున అన్నదానము జరిపించు నిమిత్తం రూ.10,116 శనివారం విరాళంగా ఇచ్చారని ఆలయ సహాయ కమిషనర్‌ గ్రంధి మాధవి తెలిపారు. ఆలయ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది దాత దంపతులకు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంలు అందజేశారన్నారుస్వామి వారి ఆదాయం రూ.4.31లక్షలు బాల బాలాజీ స్వామి దేవస్థానం నందు శనివారం లడ్డు ప్రసాదం, దర్శనము టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3,15,905, నిత్యాన్నదాన ట్రస్ట్‌నకు రూ.1,15,603 వెరశి మొత్తం రూ.4,31,508 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ తెలిపారు. స్వామి వారిని 4,193మంది దర్శించుకుని 3,278మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ సహాయ కమిషనర్‌ తెలిపారు.

 

➡️