కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల ఎన్నికల ప్రచారం

Apr 17,2024 22:21

కాట్రేనికోన మండలం పరిధిలోని మిలిటరీ పేటలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన యువత

ప్రజాశక్తి -కాట్రేనికోన

ముమ్మిడివరం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాలేపు ధర్మారావు ఇంటింటా ప్రచారంలో భాగంగా పల్లంకూర్రు, మిలటరీపేటలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు అయితాబత్తుల పండు బాబు ఆధ్వర్యంలో 30 మంది యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్‌ పథకాలు నచ్చి పార్టీలో చేరమన్నారు. ఈ దేశానికి దిశా నిర్దేశం కాంగ్రెస్‌ వల్ల సాధ్యమని యువకులు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ప్రజలు భ్రమరథం పట్టారు. ప్రతి గడప గడపకూ వెళ్లి గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నారు. ఈ రాష్ట్రానికి సరైన రాజధాని మరియు ప్రత్యేక హౌదా, పోలవరం ప్రాజెక్ట్‌ తదితరాంశాలపై ఎప్పుడూ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఇంటింటికి వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ధర్మారావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ, ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారెంటీ, ఇల్లు లేని వారికి రూ.25 లక్షలతో ఇల్లు, ఉచిత విద్య కేజీ టు పీజీ, వద్ధులకు రూ.4000 పెన్షన్‌, వితంతువులకు రూ.6000, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400 వేతనం, కేంద్రంలో అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 30 లక్షల ఉద్యోగాలు, రైతు పెట్టుబడి మీద 50 శాతం లాభంతో మద్దతు ధర, ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల రూ.8333 చొప్పున సంవత్సరానికి రూ.లక్ష, ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దివి వెంకన్న బాబు, ఐ పోలవరం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పెయ్యాల చంటిబాబు, చెల్లూరి బాలకష్ణ, మల్లాడి గోపి, పాలెపు సత్తిరాజు, పాలపు శ్రీనురాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️