నవరత్నాల రథాన్ని బహుకరించిన అభిమానులు

Apr 8,2024 11:35 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన నవరత్నాల పథకాల రూపంలో తయారు చేసి అభిమానులు ఆ పార్టీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు అందజేశారు. మండలంలోని హసన్ బాధ గ్రామంలో గ్రామస్తులు తయారుచేసిన నవరత్నాల రథంలో జగన్ కాలనీలు తదితర పథకాలకు సంబంధించిన వాటిని రూపొందించి సకటంగా తయారు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను శకటం రూపంలో తయారు చేయడం పలువురునీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్”కు సోమవారం ఈ రథాన్ని అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు. దీనిని రూపొందించిన అభిమానులను వైసీపీ నాయకులు అభినందించారు.

➡️